ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు పింఛన్లు ఇచ్చిన ఘనత ఆయనదే : మంత్రి హరీశ్ రావు

by Disha Web Desk 13 |
ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు పింఛన్లు ఇచ్చిన ఘనత ఆయనదే : మంత్రి హరీశ్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు పింఛన్లు అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ ది అని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి కార్యాలయంలో ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు మంత్రి హరీష్ రావు పైలేరియా కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫైలేరియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా పరిధిలోని 8,120 మంది పైలేరియా వ్యాధిగ్రస్తులకు రూ.40 లక్షలతో రాష్ట్రంలోనే తొలిసారిగా కిట్లను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.

దుబ్బాక పుల్లూరు గజ్వేల్ హుస్నాబాద్ లో హైలేరియా నివారణ కోసం ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పైలేరియా వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక అవార్డును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కంటి వెలుగు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ రోజా శర్మ, నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు బాల సాయిరాం, జిల్లా వైద్యాధికారి కాశీనాథ్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సిద్దిపేట జిల్లా అసుపత్రిలో ల్యాప్రోస్కోపీ యంత్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

Next Story

Most Viewed