సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మరెల్లి అనిల్ బాండ్ పేపర్

by Chintha Aamani |

ఐదు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్ జిల్లా కార్యదర్శి మరెల్లి అనిల్ కాల్చి చంపారు.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మరెల్లి అనిల్ బాండ్ పేపర్
X

దిశ, కొల్చారం: ఐదు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్ జిల్లా కార్యదర్శి మరెల్లి అనిల్ కాల్చి చంపారు. అనిల్ 2016లో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం నార్సింగి గ్రామానికి చెందిన వల సింగం మౌనిక భర్త శౌరి ప్రసాద్(అడ్వకేట్) కి ఇంటి కొనుగోలు నిమిత్తం 2016 లో రూ.80 లక్షల అప్పుగా ఇచ్చాడు. తిరిగి ఈ డబ్బుకు సంబంధించి 2021 అక్టోబర్ నెల 10వ తేదీన లెక్క చేసి రూ. 1.32 కోట్లు, రూ.1 వడ్డీ తో కలిపి 24 నెలల్లో చెల్లిస్తానని మౌనికకు బాండ్ రాసిచ్చాడు. ఆ పేపర్ మృతి చెందిన మరెల్లి అనిల్ ఫోన్ నుండి కొల్చారం కు సంబంధించిన సోషల్ మీడియా వాట్సప్ గ్రూపులలో పోస్ట్ చేశారు. ఒక గంట తర్వాత సదరు పోస్టులు డిలీట్ చేశారు. అప్పటికే ఈ బాండ్ పేపర్ విషయం మండలం లో వైరల్ గా మారింది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు అనిల్ ఎలా అప్పు ఇచ్చాడు అంటూ మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు.

Next Story