- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Man die : రంగనాయక సాగర్ గేటును ఢీకొని వ్యక్తి మృతి
by Sridhar Babu |
రంగనాయక సాగర్ కట్ట గేటుకు ప్రమాదవశాత్తు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చంద్లాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

X
దిశ, చిన్నకోడూరు : రంగనాయక సాగర్ కట్ట గేటుకు ప్రమాదవశాత్తు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చంద్లాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. 108 సిబ్బంది వెంకట్, రాజిరెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామానికి చెందిన గంగాధర కనకయ్య (55) తన పెద్ద కూతురు రేణుక స్వగ్రామమైన రామంచకు పోయి తిరిగి వస్తుండగా రంగనాయక సాగర్ కట్టపై ఎక్కే గేటును ఢీకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. 108 సిబ్బంది సిద్దిపేట జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కనకయ్యకు భార్య వజ్రావ్వ, కొడుకు మహేందర్, చిన్న కూతురు ముత్యాలు ఉన్నారు.
- Tags
- Man die
Next Story






