- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిరుత పులి సంచారం కలకలం..భయాందోళనలో ప్రజలు
చిరుతపులి సంచారం తో గ్రామ ప్రజలు అప్రమత్తమై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

దిశ,దుబ్బాక : చిరుతపులి సంచారం తో గ్రామ ప్రజలు అప్రమత్తమై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం జంగపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... జంగపల్లి గ్రామ శివారులో రైతుల పొలాల వద్ద చిరుతపులి కదలికలపై స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అది ఎక్కడ దాడి చేస్తుందోనని భయపడుతున్నారు. చిరుత పులి సంచారంపై ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పులిని బంధించడానికి అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
అటవీశాఖ అధికారులు స్పందించి అటువైపు ఎవరు వెళ్లొద్దంటూ రైతులకు తెలిపారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు వారి బృందంతో అటవీశాఖ అధికారులు ఉదయం నుంచి పర్యవేక్షణ గాలింపు చర్యలు చేపట్టారు.చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలం పనులకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.






