ఏసీబీకి చిక్కిన కొల్లూరు ఎస్సై

by Ratna Kumari |

పీడీఎస్ బియ్యం లారీ ప‌ట్టుబ‌డిన య‌జ‌మానిని కొల్లూరు ఎస్సై రూ.20వేలు లంచం డిమాండ్ చేశాడు. తాజాగా ఎస్సై ఏసీబీ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు.

ఏసీబీకి చిక్కిన కొల్లూరు ఎస్సై
X

దిశ, పటాన్ చెరు : రోజు రోజుకు అవినీతి పెరిగిపోయింది. ఇటీవ‌ల పీడీఎస్ బియ్యం లారీ ప‌ట్టుబ‌డితే.. ఆ కేసు నుంచి త‌ప్పించేందుకు ఎస్సై రూ.20వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఇవాళ ఆ ఎస్సై లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ ఘ‌ట‌న సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని కొల్లూరు పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. కొల్లూరు పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న రమేష్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 17, 2025 న పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న లారీ ని కొల్లూరు పోలీసులు పట్టుకుని కేస్ నమోదు చేశారు. ఈ కేసులో లారీ ని తప్పించేందుకు ఎస్ ఐ రమేష్ లారీ యజమానిని రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో లారీ యజమాని ఏసీబీ ని ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు శుక్రవారం లారీ ఓనర్ కొల్లూరు పోలీస్ స్టేషన్ లో రూ.20 వేల లంచం ఇస్తుండగా.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఇప్పటికే అనేక ఆరోపణలతో ఎస్ఐ రమేష్ బదిలీ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా లంచం డిమాండ్ చేసి ఏసీబీ కి చిక్కడంతో డిపార్ట్మెంట్ లో తీవ్ర చర్చకు దారి తీసింది. రమేష్ కు సంబంధించిన ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Next Story