- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హామీల అమలులో కేసీఆర్ విఫలం
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ ఆయన గజ్వేల్ ప్రజలకు ఇచ్చిన హామీలలో విఫలం అయ్యారని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు విమర్శించారు.

దిశ, గజ్వేల్ రూరల్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ ఆయన గజ్వేల్ ప్రజలకు ఇచ్చిన హామీలలో విఫలం అయ్యారని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు విమర్శించారు. శుక్రవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ లో పట్టణ పార్టీ అధ్యక్షులు మనోహర్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొని ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పేరిట నిధులు దుర్వినియోగం కాగా.. నిర్మించిన డబల్ బెడ్ రూo ఇండ్లు పేదలకు పంపిణీ చేయలేక పోయినట్లు ఆరోపించారు. మొదటి సభలో 5వేల ఇండ్లు నిర్మించి ఇస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. అంతేకాకుండా గజ్వేల్ ప్రజల సమస్యల పరిష్కారంలో చొరవ చూపకపోగా, ఆయన దర్శన భాగ్యమే కరువైనట్లు ఎద్దేవా చేశారు. ఇక్కడి ప్రజలు ఆయనపై ఎంతో ఆశతో గెలిపించగా, నిరాశే మిగిల్చడంతోపాటు ప్రశ్నించిన వారిపై ఆ పార్టీ నేతలు అక్రమ కేసులు బనాయించినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్ముకై బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా, ఇక్కడి కార్యకర్తల కృషితో 20 వార్డుల్లో సత్తా చాటుతామని స్పష్టం చేశారు. ముఖ్యంగా పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులు పెద్ద ఎత్తున కేటాయిస్తుండగా, ఇక్కడి సమస్యల పరిష్కారంలో తన వంతు భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని తెలిపారు. గజ్వేల్ పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ శ్రేణులు కష్టపడి పని చేస్తుండగా, మున్సిపల్ లో బీజేపీ జండా ఎగరవేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బీజేపీ పార్టీ అభ్యర్థి గాడిపల్లి కళ్యాణి, బీజేపీ అభ్యర్థులు ఉప్పల మధుసూదన్ గుప్త, పల్పనూరి కల్పన రవీందర్ రెడ్డి, మామిండ్ల రేణుక నాగు ముదిరాజ్, సందీప్ కుమార్, రొట్టెల శ్రీనివాస్ పాల్గొన్నారు.






