కాంగ్రెస్, బీజేపీలకు బీ టీమ్ గా మారిన కవిత

by Nallavelli.Anjaneyulu |

దిశ, గజ్వేల్ రూరల్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బీ టీమ్ గా మారిందని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు.

కాంగ్రెస్, బీజేపీలకు బీ టీమ్ గా మారిన కవిత
X

దిశ, గజ్వేల్ రూరల్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బీ టీమ్ గా మారిందని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. సోమవారం గజ్వేల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలైన హరీష్ రావు, కేటీఆర్ పై కవిత చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కవితమ్మ తెలంగాణ ఉద్యమనేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కాబట్టి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆమెను గౌరవించార‌ని తెలిపారు. అదేవిదంగా బీఆర్ఎస్ పార్టీ ఆమెకు గౌరవప్రదమైన పదవులు ఇచ్చి గౌరవించిందన్నారు. కానీ నేడు ఆమె చేస్తున్న రాజకీయాలను ప్రజలు అసహించుకుంటున్నారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి మెప్పు పొందడానికి బీఆర్ఎస్ పార్టీపై, హరీష్ రావు పై కవిత ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విధంగా కవిత విధానం ఉందని మండిపడ్డారు. హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రూ.40,000 వేల కోట్లు దోచుకున్నారని తెలిపారు.


రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై నిలదీయడం చేతకాక కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మంత్రులు చేస్తున్న అవినీతి అక్రమాలపై పోరాడకుండా.. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చిన హామీలపై నిలదీయడం చేతకాక తన రాజకీయ లబ్దికోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో కుమ్మక్కై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీపై బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు పై పసలేని ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరు చేస్తున్న రాజకీయాలను గమనిస్తున్నారని మీకు గుణపాఠం చెబుతారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మెప్పు కోసం సొంత‌ కుటుంబ సభ్యులపై బురద జల్లడం చాలా దారుణమని తెలిపారు. సామాజిక రుగ్మత కలిగిన వారు సమాజ సేవ కోసం పరితపించే వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవివేకమని అది కవితమ్మ విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు లాంటి ఎన్నో పథకాలు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడం చాలా సిగ్గుచేటని తెలిపారు. రాజకీయంగా ఎదగాలంటే సొంత పార్టీ పెట్టుకుని ప్రజా సమస్యలపై పోరాడి ప్రజల మన్ననలతో ఎదగాలని, కానీ ఎదుటివారి ఆత్మగౌరవాన్ని కించపరిచి వారి పునాదుల మీద ఎదగాలనుకోవడం సరైన పద్ధతి కాదన్నారు.

Next Story