అన్ని రాష్ట్రాలకన్నా తెలంగాణ రాష్ట్రం అద్భుతం..

by Disha Web Desk 20 |
అన్ని రాష్ట్రాలకన్నా తెలంగాణ రాష్ట్రం అద్భుతం..
X

దిశ, ములుగు : మా మహారాష్ట్రలో పంటలకు నీరులేక ఏడారిగా మారడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్ట్ ల నిర్మాణంతో పంటలు పచ్చని మాగానిగా మారిందని మహారాష్ట్ర అమరావతికి చెందిన రైతుల బృందం కితాబిచ్చింది. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ములుగు, మార్కుక్ మండలాల్లోని మహారాష్ట్రకు చెందిన రైతుల బృందం పర్యటించి పలుఅభివృద్ది పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. పర్యటనకు వచ్చిన బృందానికి రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి స్వాగతం పలికి గజ్వేల్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను, ప్రాజెక్ట్ ల నిర్మాణం గురించి క్లుప్తంగా వివరించారు. మొదటగా మార్కుక్ మండల కేంద్రంలోని రైతు వేదిక, కొండపొచమ్మ సాగర్ పంప్ హౌస్, డ్యాం ను పరిశీలించారు.

ములుగు మండలంలో అనంతరం ఫారెస్ట్ కళాశాల అగ్రికల్చర్ యూనివర్సిటీ సందర్శించారు. అక్కడి నుండి వర్గల్ మండలంలోని సింగాయిపల్లి అటవీ ప్రాంతం, ఈ సందర్భంగా వారు మాట్లాడుతు మహారాష్ట్రలో పంటలకు నీరు లేక పొలాలు బీటలుగా మారి ఏం తోచక రోజుకు 8నుండి 9 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అందులో అమరావతి, విదర్భ చెందిన రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. మా రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కేవలం కులమతాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారే కానీ రైతుల ఆత్మహత్య పై ఎవరు పట్టించుకోవడం లేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలకు మేరకు తెలంగాణ రాష్ట్రంలో పర్యటంచి చూస్తే ప్రాజెక్ట్ ల నిర్మాణంతో పంటలు పండి పచ్చని మాగానిగా ఏర్పడిందని అన్నారు.

మా వద్ద నీరు లేక సంవత్సరానికి ఒక పంట వస్తే తెలంగాణలో ప్రాజెక్ట్ ల నిర్మాణం మూడు పంటలు పండటం అద్బుతం అని అన్నారు. కొండపొచమ్మ సాగర్ దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ నిర్మాణం చేపట్టారని అన్నారు. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం రైతులకు వరమని, మావద్ద రాత్రి పూట మాత్రమే కరెంట్ ఇస్తుందని అన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరకల్పించి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని, మా మహారాష్ట్రలో పత్తిపంటకు గిట్టుబాటు ధరలేక రైతులు ఇంట్లో పెట్టుకోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అచ్చం గారి భాస్కర్, రైతు కమిటీ సభ్యులు, ఏఎంసీ డైరెక్టర్ ప్రవీణ్ చారి, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed