- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కానుకుంటలో అక్రమ నిర్మాణాలు.. అధికారుల హెచ్చరికలు బేఖాతర్
నిబంధనలు డోంట్ కేర్.. మాకు అనుమతులు అవసరం లేదు.. అధికారులు హెచ్చరించినా పట్టించుకోం..

దిశ, గుమ్మడిదల : నిబంధనలు డోంట్ కేర్.. మాకు అనుమతులు అవసరం లేదు.. అధికారులు హెచ్చరించినా పట్టించుకోం.. నోటీసులు జారీ చేసిన లెక్క చేయం.. అంతా మా ఇష్టం. ఈ ధోరణిలో నిర్వాహకులు గరుడ క్రికెట్ మైదానం, రిసార్ట్ పేరిట కానుకుంట లో భారీ అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామంలో సర్వే నంబర్లు 342, 275లో సుమారు 5 ఎకరాల ముంచి విస్తీర్ణంలో ఈ పనులు కొనసాగుతున్నాయి. భారీ మైదానం, రిసార్ట్ పనులు పూర్తయ్యే దశకు వచ్చి కూడా ఒక్క అనుమతి తీసుకోకపోవడం నిర్వాహకుల లెక్క లేనితనాన్ని స్పష్టంగా చూపిస్తుంది.
చర్యలు తీసుకోవాలి..: ప్రజా ప్రతినిధుల డిమాండ్
పంచాయతీ కార్యదర్శి పలుమార్లు నోటీసులు జారీ చేసి పనులను ఆపాలని హెచ్చరించినా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. అనుమతులు లేకుండా నిర్మాణం కొనసాగించడం చట్టవిరుద్ధం, వెంటనే ఆపకపోతే చర్యలు తప్పవు అని హెచ్చరికలు జారీ చేసిన, నిర్వాహకులు పట్టించుకోకుండా పనులను వేగంగా కొనసాగిస్తున్నారు.అక్రమ నిర్మాణాపై చర్యలు తీసుకోవాలని పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నోటీసులు ఇచ్చాం : పంచాయతీ కార్యదర్శి విజయశాంతి
గరుడ క్రికెట్ స్టేడియం, రిసార్ట్ అక్రమ నిర్మాణం మా దృష్టికి రాగానే పనులను ఆపాలని హెచ్చరించాం. గత నెలలో నోటీసు కూడా జారీ చేశాం. నిర్మాణానికి సంబంధించిన పూర్తి పత్రాలను పంచాయతీకి అందజేసిన తర్వాతే పనులను కొనసాగించాలని చెప్పాం. కానీ నిర్వాహకులు ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి పత్రాలు ఇవ్వలేదు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం. సంబంధిత నిర్మాణంపై చట్టరీత్యా చర్యలు చేపడతాం.






