- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లాస్టింగ్‌తో ఇండ్లకు బీటలు... నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్
పాత వెల్లటూరు గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్నటు వంటి ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ఎత్తిపోతల పథకం పైపులైన్ పనులు

X
దిశ, చింతలపాలెం : పాత వెల్లటూరు గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్నటు వంటి ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ఎత్తిపోతల పథకం పైపులైన్ పనులు వివాదానికి దారి తీసాయి. పైపులైన్ తవ్వకంలో భాగంగా కాంట్రాక్టర్ బ్లాస్టింగ్ చేయడంతో అనేక ఇళ్ల గోడలు బీటలు పడినట్లు వెల్లటూరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బ్లాస్టింగ్ ఆపాలని అడిగితే కాంట్రాక్టర్ వినడంలేదట. ఎక్కువ మాట్లాడితే కేసు పెట్టి లోపల పడేస్తా అంటూ బెదిరించాడని దాసు గోవిందయ్య,లక్ష్మీ తెలిపారు. దాసు గోవిందయ్య మాట్లాడుతూ మా ఇళ్లు పగిలిపోతున్నాయి, ఎంతో కష్టపడి వేసుకున్న బోర్లు కూడా ఎండిపోయాయి. జీవనాధారం దెబ్బతిందని వెల్లడించాడు. నష్టపరిహారం ఇవ్వకపోతే పనులు జరగనివ్వబోమని వార్నింగ్ ఇచ్చారు.
Next Story






