దేశ సైనికునికి ఇంటి స్థలం అందజేసిన గ్రామస్తులు

by Dishanational1 |
దేశ సైనికునికి ఇంటి స్థలం అందజేసిన గ్రామస్తులు
X

దిశ, ములుగు: దేశ సేవ చేస్తూ దేశాన్ని, దేశ ప్రజలను కాపాడుతున్న దేశ సైనికునికి ములుగు మండలం సింగన్నగూడ గ్రామస్తులు తమ గ్రామంలో 100 గజాల ఇంటి స్థలాన్ని బహుకరించారు. వివరాల్లోకెళ్తే ఆదివారం దేశ ప్రజల కోసం బోర్డర్ లో పనిచేస్తున్న ములుగు మండలం సింగన్నగూడ గ్రామానికి చెందిన తాళ్ల వెంకటేష్ కు సింగన్నగూడ గ్రామం నుండి మిలిటరీలోకి వెళ్లాడు. తను ఉండటానికి గ్రామంలో ఇంటి స్థలం లేకపోవడంతో గ్రామస్తులు అంతా కలిసి రామాలయం ఆలయం వెనుక ఉన్న 100 గజాల స్థలాన్ని సైనికుడు వెంకటేష్ కు గ్రామస్తులు కలిసి అందజేశారు. ఆ స్థలం యొక్క హక్కులను సైనికుడు వెంకటేష్ కి చెందుతాయని, హక్కుపత్రాన్ని ములుగు ఎస్సై రంగ కృష్ణ, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డితో కలిసి సర్పంచ్ బాలకృష్ణ, ఉప సర్పంచ్ స్వామి గౌడ్ చేతుల మీదుగా గ్రామస్తులు అందజేశారు. డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, ఎస్ఐ రంగ కృష్ణులు మాట్లాడుతూ దేశం ప్రజల కోసం బార్డర్ లో సైనికుడు వెంకటేష్ పోరాడుతూ ప్రజల కోసం సేవలందిస్తూ ఎంతోమంది సైనికులకు ఇలాంటి స్ఫూర్తి కల్పించాలని సింగన్నగూడ గ్రామ ప్రజలను వారు అభినందించారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎంపీటీసీ నవ్యశ్రీ రాజేందర్ రెడ్డి, యాదగిరి, డి. రాములు, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed