బాలికపై అత్యాచారం.. పోక్సో కోర్టు సంచలన తీర్పు

by srinivas |
బాలికపై అత్యాచారం.. పోక్సో కోర్టు సంచలన తీర్పు
X

దిశ, వెబ్ డెస్క్: బాలికపై అత్యాచారం కేసులో పోక్సో స్పెషల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి జీవిత ఖైదుతో పాటు జరిమానా కూడా విధించింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. హోలగుంద మండలం బొమ్మణహళ్లిలో బోయ రంగముని అనే వ్యక్తి 2021, ఆగస్టు 13న బాలికపై అత్యాచారం చేశారు. అయితే అప్పుడు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి సైతం కర్నూలు పోక్సో స్సెషల్ కోర్టులో విచారణ కొనసాగింది. బాలికపై నిందితుడు రంగముని అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. దీంతో నిందితుడు రంగమునికి కోర్టు జీవిత ఖైదు విధించింది. రూ. 20 వేలు ఫైన్ వేసింది.

Next Story

Most Viewed