ట్రాన్స్ కో నిర్లక్ష్యం.... నిండు ప్రాణం బలి

by Kalyani |
ట్రాన్స్ కో నిర్లక్ష్యం.... నిండు ప్రాణం బలి
X

దిశ బాన్సువాడ : ట్రాన్స్ కో అధికారుల నిర్లక్ష్యానికి సోమవారం ఒక నిండు ప్రాణం బలైంది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని రాయకూర్ క్యాంప్ లో కరెంట్ షాక్ తో అదే గ్రామానికి చెందిన లతీఫ్ (28) అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులకు కరెంటు స్తంబాలు, వైర్లు నెలకొరిగాయి. ఇదిలా ఉండగా వాటిని ఉదయం వరకు కూడా ట్రాన్స్ కో అధికారులు సరి చేయడం కాదు కదా కనీసం పట్టించుకోక పోవడంతో ఈ ఘాతుకం జరిగిందని స్థానికులు తెలిపారు. గ్రామ శివారులో ఉపాధి హామీ పనులకు వెళ్లిన లతీఫ్ ఇంటికి వస్తుండగా దారికి అడ్డంగా ఉన్న వైరును పైకెత్తి వచ్చే ప్రయత్నంలో కరెంటు వైరు అతుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడని, దీనికి కారకులైన ట్రాన్స్ కో అధికారులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed