ఆయిల్ పామ్ సాగుతో అధిక ఆదాయం

by Ratna Kumari |

దిశ, రేగోడ్ : ఆయిల్ పామ్ సాగుతో రైతులు అధిక ఆదాయం పొందవచ్చని మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్ అన్నారు. శనివారం జగిర్యాల శివారులో నాగారం ధన్ రాజ్ ఆయిల్ పామ్

ఆయిల్ పామ్ సాగుతో అధిక ఆదాయం
X

దిశ, రేగోడ్ : ఆయిల్ పామ్ సాగుతో రైతులు అధిక ఆదాయం పొందవచ్చని మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్ అన్నారు. శనివారం జగిర్యాల శివారులో నాగారం ధన్ రాజ్ ఆయిల్ పామ్ తోటను ఆయన పరిశీలించి మాట్లాడారు. నీటి సౌకర్యం ఉన్న రైతులు పత్తి, వరితో పాటు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచించారు. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా కంపెనీ ప్రతినిధులు ఆయిల్ పామ్ గెలలు కొనుగోలు చేస్తారని తెలిపారు. ఎకరాకు 57 మొక్కలు నాటుకోవచ్చని, ప్రభుత్వం రాయితీపై ఒక్కటి రూ.20కే అందిస్తోందని చెప్పారు. బిందు సేద్యం పరికరాలపై ఎస్సీ, ఎస్టీలకు100 శాతం, బీసీలకు 90 శాతం, మిగతా వారికి 80 శాతం రాయితీ లభిస్తుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి మహేష్ , లీవ్ పామ్ కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ జాన్సన్ ఉన్నారు.

Next Story