జిరాక్స్ కాఫీలు ఇచ్చిన ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి హ‌రీశ్ రావు

by Ratna Kumari |

దిశ, సిద్దిపేట ప్రతినిధి : కాంగ్రెస్ నాయకుల తీరు పై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సిద్దిపేట

జిరాక్స్ కాఫీలు ఇచ్చిన ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి హ‌రీశ్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : జిరాక్స్ కాఫీలు ఇచ్చిన ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే త‌న్నీరు హ‌రీశ్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో దీక్ష దివాస్ ను పురస్కరించుకొని సభ నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత అందే శ్రీ కి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంత‌రం హ‌రీశ్ రావు మాట్లాడుతూ నాటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల మీద ప్రేమతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయలేదన్నారు. కేసీఆర్ దీక్ష ఫలితంగా అనివార్య పరిస్థితుల్లో తెలంగాణ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే జిరాక్స్ పేపర్లు ఇచ్చిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ చరిత్ర రాస్తే.. రైఫిల్ రెడ్డి ద్రోహం గురించి రాయాల్సి వస్తుందన్నారు. ప్రొఫెసర్ కోదండ రాం కు ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి పై ప్రేమ పెరిగిందన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని కించ పరిచేలా కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట ఆంధ్ర ప్రదేశ్ లాయర్లు వాదనలు వినిపిస్తుంటే.. ఉత్తుత్తి రెడ్డి, రేవంత్ రెడ్డి లు నోరు ఎత్తడం లేదని మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్ర బాబు నాయుడు కృష్ణా జలాలను తరలించేందుకు కుట్రలు పన్నుతుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫార్మాసిటీ భూములను తన అన్న‌య్య‌ల‌కు ఎలా కట్టబెట్టాలనే ఆలోచన చేస్తున్నారని ఫైర్ అయ్యారు.సీఎం రేవంత్ రెడ్డి తీరును ఉద్యమ కారులు గుర్తించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం మాజీ సీఎం కేసీఆర్ పోరాటం, చరిత్ర ఉంటుందన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కు మాజీ సీఎం కేసీఆర్ దీక్ష గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాంది పలికిన రోజు దీక్ష దివాస్ అన్నారు. కేసీఆర్ ఉద్యమ చరిత్ర సూర్యకాంతి అన్నారు. చెరపడం సీఎం రేవంత్ రెడ్డి తరం కాదన్నారు. తెలంగాణ ద్రోహిగా రేవంత్ రెడ్డి కి ఉన్న మరక చెరిగి పోదని స్పష్టం చేశారు. బీసీలను, వృద్ధులను యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేసిన గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి, మాజీ ఎఫ్ డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Next Story