- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుండెపోటు అని నమ్మించాడా?.. అసలేం జరిగింది..!
తన భార్య గుండెపోటుతో మరణించిందని ఓ ప్రభుత్వ టీచర్ అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు.

దిశ, సంగారెడ్డి: తన భార్య గుండెపోటుతో మరణించిందని ఓ ప్రభుత్వ టీచర్ అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు. అంత్యక్రియలు చేస్తున్న సమయంలో మృతురాలి గొంతుపై మరకలు చూసి హత్య చేసి ఉంటారనే బంధువులు అనుమానించడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో నివాసముంటున్న సుచిత ఆదివారం రోజు అనుమానస్పదంగా మృతి చెందింది. ప్రభుత్వ టీచర్ శ్రీనివాస్ తన భార్య గుండెపోటుతో మరణించిందని బంధువులను నమ్మించాడు. మాధ్వార్‌లో అంత్యక్రియల సమయంలో గొంతు వద్ద మరకలు చూసి సుచిత బంధువులు అంత్యక్రియలను నిలిపివేశారు. వెంటనే బంధువులు కొండాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే ప్రస్తుతం పోస్టుమార్టం జరుగుతోందని మరికాసేపట్లో పూర్తి వివరాలను వెల్లడిస్తామని కొండాపూర్ సీఐ సుమన్ దిశతో మాట్లాడుతూ తెలిపారు.
- Tags
- medak






