- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్సై, కానిస్టేబుల్స్ అభ్యర్థులకు శుభవార్త..
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం మెయిన్స్ పరీక్షలు రాయబోతున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే జీఎంఆర్ శుభవార్తను అందించారు.

దిశ, అమీన్ పూర్: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం మెయిన్స్ పరీక్షలు రాయబోతున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే జీఎంఆర్ శుభవార్తను అందించారు. ఈనెల 30వ తేదీ నుండి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఈ నెల 28, 29 తేదీల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థులు పటాన్చెరు పోలీస్ స్టేషన్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని అభ్యర్థులకు ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో ప్రాథమిక పరీక్ష సందర్భంగా జీఎంఆర్ పోలీస్ ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన 376 మంది అభ్యర్థుల్లో 271 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారని తెలిపారు. మెయిన్స్ పరీక్షల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనపరిచి పటాన్చెరు నియోజకవర్గానికి రాష్ట్రస్థాయిలో మంచి పేరు తీసుకురావాలని ఆయన అభిలాషించారు.






