- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్యోగం పేరిట ఘరానా మోసం
ఉద్యోగం పేరిట, స్నేహితుడి పేరిట ఇన్ స్టాగ్రామ్ ఫేక్ ఐడీతో సైబర్ నేరగాళ్లు ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతూ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

రూ.55వేలు కాజేసిన సైబర్ నేరగాడు
దిశ, సిద్దిపేట ప్రతినిధి: ఉద్యోగం పేరిట, స్నేహితుడి పేరిట ఇన్ స్టాగ్రామ్ ఫేక్ ఐడీతో సైబర్ నేరగాళ్లు ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతూ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి టెలిగ్రామ్ గ్రూప్ లో జాబ్ నోటిఫికేషన్ వచ్చిందని సైబర్ నేరస్తుడు నమ్మబలికాడు.
మంచి జీతం వస్తుందని అన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించాడు. ఈ క్రమంలో ప్రాసెసింగ్ చార్జీలు, టాక్స్ లు కలిపి రూ.55వేలు చెల్లించాలని తెలిపాడంతో బాధితుడు గూగుల్ ఫే, ఫోన్ ఫే నుంచి డబ్బు పంపించాడు. బాధితుడు తిరిగి అదే ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ వచ్చింది. అదేవిధంగా సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో బాధితుడికి సైబర్ నేరగాడు తన ఫ్రెండ్ ఫేక్ ఇన్స్ స్టాగ్రామ్ ద్వారా డబ్బు ఎమర్జెన్సీగా అవసరం ఉన్నాయని త్వరగా పంపించాలని రిక్వెస్ట్ పంపించాడు.
బాధితుడు రూ.9 వేలు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పంపించాడు. తరువాత తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి తెలుసుకోగా నేను అలాంటి మెసేజ్ పెట్టలేదని తెలిపాడు. దీంతో బాధితులు జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్వేత మాట్లాడుతూ సైబర్ నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ క్రైం జరిగిన వెంటనే 1930 కి కాల్ చేస్తే డబ్బు తిరిగి పొందేలా చేయవచ్చన్నారు.






