- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ మద్యం పట్టివేత
by Bhanu |
ములుగు మండలం పరిధిలో భారీగా నిల్వ చేసిన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు గజ్వెల్ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు

X
దిశ, గజ్వెల్: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మద్యం అక్రమ రవాణా, నిల్వలపై పోలీసులు దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో ములుగు మండలం పరిధిలో భారీగా నిల్వ చేసిన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు గజ్వెల్ సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం పక్కా సమాచారంపై టాస్క్‌ఫోర్స్ బృందంతో కలిసి చేపట్టిన దాడుల్లో ములుగు మండల కేంద్రంలో ఉన్న అర్వెమ్ హాస్పిటల్ పరిసరాల్లో పెద్ద ఎత్తున నిల్వ చేసిన మద్యం బయటపడిందని ఆయన వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల్లోకి వెళ్లితే.. ములుగు గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టే ఉద్దేశంతో మద్యం నిల్వ చేసి ఉంచినట్లు చెప్పారు.
అక్కడి నుంచి సుమారు రూ.7.40 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి, వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. అదే విదంగా మరో దాడిలో చిన్నతిమ్మాపూర్ గ్రామంలో సుమారు రూ.80 వేలు విలువ చేసే మద్యం కూడా స్వాధీనం చేసినట్లు ములుగు ఎస్‌ఐ రఘపతి వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎలాంటి అక్రమ కార్యకలాపాలను సహించబోమని, ఎన్నికల శాంతి భద్రత కు భంగం కలిగించే చర్యలపై కఠినంగా వ్యవహరించనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
- Tags
- medak
Next Story






