మూడున్నర కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన : ఎమ్మెల్యే చింత ప్ర‌భాక‌ర్

by Nallavelli.Anjaneyulu |

సదాశివాపేట పట్టణంలో టీయుఎఫ్ఐడిసీ నిధులు తో మూడున్నర కోట్లతో ఎమ్మెల్యే చింత ప్రభాకర్.. టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి తో క‌లిసి ప‌లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

మూడున్నర కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన :  ఎమ్మెల్యే చింత ప్ర‌భాక‌ర్
X

దిశ, సదాశివపేట : సదాశివాపేట పట్టణంలో టీయుఎఫ్ఐడిసీ నిధులు తో మూడున్నర కోట్లతో ఎమ్మెల్యే చింత ప్రభాకర్.. టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి తో క‌లిసి ప‌లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వీటిలో రూ.75 లక్షలతో సదాశివపేట కొత్త మున్సిపల్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన, అనంతరం రూ. 165 లక్షలతో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి జాతీయ రహదారి వరకు సెంట్రల్ మీడియం లైట్స్ కు శంకుస్థాపన, రూ. 50 లక్షలతో జాతీయ రహదారి నుంచి సిద్దాపూర్ కాలనీ వరకు సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే చింత ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. అవసరాలు గుర్తించి అభివృద్ధి చేయాలని.. ప్రజలకు కావాల్సింది రాజకీయాలు కాదు, అభివృద్ధి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సమస్యలు, అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా గత ప్రభుత్వం లో అభివృద్ధి, సంక్షేమ పధకాలు అమలు చేశామని గుర్తు చేశారు. పెండ్డింగ్ బిల్లులు చెల్లించక పోవడంతోనే కాంట్రాక్టర్ లు పనులు చేయడానికి ముందుకు రావడం లేదు. ప్రజల అవసరాలు గుర్తించి గత ప్రభుత్వం లో 25 కోట్లు మంజూరు చేసి అందులో 13 కోట్ల తో పనులు పూర్తి కాగా మిగతా మంజూరు అయినా డబ్బులు ప్రభుత్వం మారడంతో క్యాన్సల్ చేయడం జరిగింది. క్యాన్సల్ అయినా నిధులు మంజూరు చేయించాలని మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఆరున్నారా కోట్లతో సిద్దాపూర్ రోడ్డు నిర్ణయం చేసినట్లు ఎమ్మెల్యే గుర్తు చేశారు. కార్యక్రమం లో మాజీ మున్సిపల్ చైర్మన్ అపర్ణ శివరాజ్ పాటిల్, చింత సాయినాథ్, చీల మల్లన్న, వీరేషం, ఆకుల శివ, కోడూరు అంజయ్య, సాతని శ్రేశైలం, మోబిన్, ఖలీమ్ పాటిల్, నజీర్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story