రైతులకు ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోళ్లు: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

by Disha Web Desk 1 |
రైతులకు ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోళ్లు: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
X

దిశ, మెదక్ ప్రతినిధి: గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ద్వారకా గార్డెన్ లో యాసంగి-2023 ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అధికారులు, రైస్ మిల్లర్ల తో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని భావించి సీఎం కేసీఆర్ రైతుల పట్ల గౌరవంతో ఉచిత విద్యుత్, సాగు నీరు, రైతు బంధు అందిస్తున్నారని తెలిపారు.

నేడు జిల్లాలో రెండు పంటలకు కలిపి ఒక లక్ష మెట్రిక్ టన్నుల నుంచి 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తూ దళారీల ప్రమేయం లేకుండా కనీస మద్దతు చెల్లిస్తూ రైతులకు ప్రభుత్వం భరోసా, ధైర్యం కల్పిస్తుందన్నారు. అధికార యంత్రంగం రైతులకు ఇబ్బంది కలగకుండా సంబంధిత శాఖలు సమిష్టిగా సమన్వయంతో పని చేయాలని ఆమె కోరారు. కొనుగోలు కేంద్రాలలో అవసరమైన కాంటాలు, తేమను కొలిచే యంత్రాలు, ప్యాడి కాలీనర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, అవసరం మేరకు కొత్త,పాత గన్ని సంచులు నిష్పత్తి ప్రకారం అందించాలని సూచించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఈ యాసంగిలో 4 .43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విపణిలోకి వచ్చే అవకాశముందన్నారు. అందుకు అనుగుణంగా పాక్స్, ఐ.కె.పీ, డీసీఎంఎస్, రైతు ఉత్పత్తి సంస్థల ఆధ్వర్యంలో 406 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి ఇది వరకే సిబ్బందికి దిశా నిర్దేశం చేశామన్నారు. ప్రతి కేంద్రంలో కావలసిన ఎలక్ట్రానిక్ కాంటాలు, తేమను కొలిచే యంత్రాలు, ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్ లు అందుబాటులో ఉంచామన్నారు.

గొనె సంచుల కొరత లేదని, మానిటరింగ్ చేసేందుకు ఇద్దరు సీనియర్ అధికారులను నియమించామని తెలిపారు. జిల్లాలో 35 బాయిల్డ్ రైస్ మిల్లులకు ధాన్యం తరలించే విధంగా కొనుగోలు కేంద్రం నుంచి మిల్లులకు లారీలు పంపుటకు జియో ట్యాగింగ్ చేస్తున్నామని తెలిపారు. రైతులకు వెంటనే డబ్బులు చెల్లించే విధంగా ట్యాబ్ ఎంట్రీలు పక్కాగా వెను వెంటనే చేసేలా చూడాలన్నారు. చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేదా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు సమాచారం అందజేయాలన్నారు.

అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, రమేష్ లు మాట్లాడుతూ ఈసారి ధాన్యంలో తాళ్లు ఎక్కువగా వచ్చే అవకాహమున్నందున ప్యాడి క్లినర్ లు పెట్టి శుభ్రం చేసిన ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చేలా రైతులకు అవగాహన ఆకలిగించాలన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటాల్ కు ఏ-గ్రేడ్ ధాన్యం కు రూ.2,060, సాధారణ రకం రూ.2,040 రూపాయల ప్రకటించిన గోడ పత్రిక, కర పత్రాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్లు ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో జిల్లా రైస్ మిల్లుల సంఘం అధ్యక్షులు చంద్రపాల్, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి, జిల్లా సహకార అధికారి కరుణ, డీఎస్పీ సైదులు, ఆర్డీవో సాయి రామ్, జిల్లా పరిషత్ సీఈవో శైలేష్, డీపీవో సాయిబాబ, వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, ఐకెపీ సిబ్బంది, ఫ్యాక్స్ చైర్మన్లు, రైస్ మిల్లర్లు, మార్కెటింగ్ కమిటీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Next Story