బెంగాల్‌లో బంగ్లా ఎంపీ డెడ్‌బాడీ.. హత్య జరిగిందా ?

by Shamantha N |
బెంగాల్‌లో బంగ్లా ఎంపీ డెడ్‌బాడీ.. హత్య జరిగిందా ?
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ మిస్సింగ్ మిస్టరీ వీడింది. కోల్ కతా న్యూటౌన్ లోని ఖాళీ ఇంట్లో ఆయన డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. ట్రీట్మెంట్ కోసం కొద్దిరోజుల క్రితం కోల్ కతా వచ్చిన ఆయన.. గత 8 రోజులుగా అదృశ్యమయ్యారు. బెంగాల్ పోలీసులు, బంగ్లాదేశ్ అధికారులు ఆయనకోసం తీవ్రంగా గాలించారు.

బంగ్లాదేశ్‌ అధికార పార్టీ అవామీ లీగ్‌ ఎంపీ అన్వరుల్‌ అజీమ్‌ ట్రీట్మెంట్ కోసం బెంగాల్ వచ్చారు. మే 12న కోల్ కతా బారానగర్ లోని తన స్నేహితుడు గోపాల్ బిశ్వాస్ ఇంట్లో ఉన్నారు. వెంటనే వస్తానని రెండ్రోజుల తర్వాత గోపాల్ ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. కానీ, ఆయన ఎంతసేపటికీ తిరిగి రాకపోడవంతో గోపాల్ సహా ఎంపీ కుటుంబసభ్యులు కాల్స్ చేశారు. ఎవరి కాల్స్ కు ఆయన స్పందించలేదు. మే 14 నుంచి ఎంపీ ఫోన్ స్విచ్చాఫ్ అయ్యింది. ఈ విషయాన్ని అన్వరుల్ కుటుంబసభ్యులు ప్రధాని షేక్ హసీనా దృష్టికి తీసుకెళ్లారు. భారత్ లోని దౌత్యవేత్తలకు సమాచారం ఇచ్చారు. 8 రోజులుగా అన్వరుల్ కోసం గాలిస్తుండగా.. బుధవారం ఆయన డెడ్ బాడీ దొరికింది. అయితే, ఎంపీని ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసి మృతదేహాన్ని కోల్‌కతాలోని న్యూటౌన్ ప్రాంతంలో పడేసి ఉంటారని సందేహిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో న్యూటౌన్‌లోని ఫ్లాట్‌లో రక్తపు మరకలు ఉన్నట్లు గుర్తించారు.

ఎంపీ అన్వరుల్ బంగ్లాదేశ్ కనెక్షన్‌‌తో పాటు భారత సిమ్‌లను కూడా ఉపయోగిస్తున్నారు. రెండు ఫోన్లు ప్రస్తుతం స్విచ్ఛాప్‌లో ఉన్నాయి. ఎంపీ అన్వరుల్ అజీమ్ కుమార్తె ముంతారిన్ ఫిర్దౌస్ మంగళవారం ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగానికి తన తండ్రి అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి మహ్మద్ హరూన్ రషీద్ ప్రకారం.. ఎంపీ ఫోన్ కొన్ని సార్లు స్విచ్ఛాప్, కొన్ని సార్లు పనిచేసినట్లు పేర్కొన్నారు.

Next Story