- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని రైతుల నిరసన
by Ratna Kumari |
వరి ధాన్యం కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామం వద్ద రైతులు నిరసన తెలిపారు.

X
దిశ, సిద్ధిపేట అర్బన్ : వరి ధాన్యం కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామం వద్ద రైతులు నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట - తొగుట రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వరి ధాన్యం కొంటారా.. కొనరా అని సూటిగా ప్రశ్నించారు. వరిధాన్యం కొనుగోళ్లు ప్రారంభించని పక్షంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
Next Story






