ఎక్సైజ్‌లో వసూల్ రాజాలు..!

by Bhanu |   (  Updated:2025-12-08 08:39:08  IST  )

చిన్న ఘనపూర్ ఐఎంఎల్ డిపోలో ఎక్సైజ్ అధికారులు మద్యం షాపుల యాజమానుల నుంచి అక్రమంగా డబ్బులు వసూల్ చేస్తున్నారు

ఎక్సైజ్‌లో వసూల్ రాజాలు..!
X

దిశ, కొల్చారం: చిన్న ఘనపూర్ ఐఎంఎల్ డిపోలో ఎక్సైజ్ అధికారులు డిపో అధికారులు కుమ్ముక్కయ్యారు. నూతన వైన్స్ దుకాణాల యజమానులు, బార్‌ల యజమానుల నుండి డబ్బులు వసూలుకు తెర లేపారు. మండలంలోని చిన్న ఘనపూర్ ఐఎంఎల్ డిపో నుండి మెదక్ సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 118 వైన్స్ దుకాణాలకు, 16 బార్ లకు ప్రతిరోజు దుకాణాల డిమాండ్ మేరకు మద్యం సరఫరా చేస్తారు. ఈనెల మొదటి తేదీ నుండి ప్రారంభమైన నూతన వైన్స్ దుకాణాలు బార్ యజమానుల నుండి భారీగా డబ్బులు వసూలు చేశారు. రెండు సంవత్సరాల వరకు మీ దుకాణాలకు మేమే మద్యం సరఫరా చేయాలి. అడిగిన బ్రాండ్ మద్యం సకాలంలో సరఫరా చేయాలంటే ఐఎంఎల్ డిపోలో ఒక్కో వైన్స్, బార్ కు రూ. 16 వేల రూపాయలు చెల్లించాల్సిందే నంటూ హుకుం జారీ చేశారు. దీంతో చేసేదేమీ లేక మద్యం దుకాణాల యజమానులు డబ్బులు చెల్లించి డిపో నుండి మద్యం తీసుకెళ్లారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలోని 118 వైన్స్ దుకాణాలు, 16 బార్ల 16 బార్ ల యజమానులు ఐఎంఎల్ డిపో అధికారులు ఎక్సైజ్ అధికారులు ఆదేశించిన విధంగా డిపోలో డబ్బులు చెల్లించి మద్యం తీసుకెళ్లారు.

ప్రతిరోజు బేబీలకు ప్రతిరోజు వే బిల్లుకు 500 ఇవ్వాల్సిందే ..
చిన్న గణపురం ఐఎంఎల్ డిపో నుండి మద్యం తీసుకెళ్లేందుకు ప్రతిరోజు వచ్చే వాహనాల కు మద్యం లోడ్ అయిన తర్వాత చిన్న గణపురం ఐఎంఎల్ డిపో నుండి మద్యం తీసుకెళ్లేందుకు ప్రతిరోజు వచ్చే వాహనాలకు మద్యం లోడ్ అయిన తర్వాత వే బిల్లు పై రెవెన్యూ స్టాంప్ అతికించి స్టాంపు వేసి ఇవ్వడానికి ఒక్కో బిల్లుకు రూ 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. చిన్న చిన్న దుకాణాల యజమానులు ఇద్దరు ముగ్గురు కలిసి మద్యం లోడ్ నింపితే మూడు వైన్స్‌లకు సంబంధించిన మూడు బిల్లులకు రూ. 1500 వసూలు చేస్తున్నారు. అసలు ఏమిటి అని దుకాణాల యజమానులు ప్రశ్నిస్తే వారికి ఆరోజు మద్యం లోడు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు సిబ్బంది అడిగిన విధంగా డబ్బులు ఇస్తూ మద్యం దుకాణాల యజమానులు డిపో నుండి మద్యం తీసుకెళ్తున్నారు.

పంపకల్లో తేడాతో..
డిపో అధికారులు, డిపోలో పనిచేసే ఎక్సైజ్ సిబ్బంది మెదక్ సంగారెడ్డి జిల్లాలోని వైన్స్ దుకాణాల నుండి బార్‌ల నుండి వసూలు చేసిన డబ్బుల పంపిణీలో బేధాభిప్రాయాలు రావడంతో ఈ విషయం బయటకు పోక్కింది. ఈ విషయమై చిన్న ఘనపూర్ ఐఎంఎల్ డిపో మేనేజర్ నాగేశ్వరరావును నూతన దుకాణాల నుండి డబ్బులు వసూలు చేసిన విషయంపై వివరణ కోరగా డబ్బులు వసూలు చేసిన విషయం తన దృష్టికి రాలేదంటూ ఏదైనా ఉంటే మాట్లాడదాం అంటూ సమాధానం దాటవేశారు.

Next Story