గుండెపోటుతో ఉపాధి హామీ కూలి మృతి

by Disha Web Desk 1 |
గుండెపోటుతో ఉపాధి హామీ కూలి మృతి
X

దిశ, కౌడిపల్లి: గుండెపోటుతో ఉపాధి హామీ కూలి మృతి చెందిన ఘటన సోమవారం మండల పరిధిలోని దేవులపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన చాకలి నాగరాజు(35) రెగ్యులర్ గా ఉపాధి హామీ పనులు చేసేవాడు. రోజు మాదిరి గానే సోమవారం కూడా ఉపాధి హామీ పనికి వెళ్లాడు. అక్కడ పని చేస్తుండగా తనకు ఒంట్లో బాగోలేదని.. ఏదోలా అవుతోందని తోటి కూలీలకు తెలిపాడు.

నాగరాజును వెంటనే తోటి కూలీలు ఆటోలో కౌడిపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కౌడిపల్లిలోని ప్రభుత్వాసుపత్రి వైద్యులు పరీక్షించి నాగరాజు అప్పటికే మరణించాడని కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు తెలిపారు. మృతుడికి భార్య విజయ, ఇద్దరు కుమారులున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివప్రసాద్రెడ్డి తెలిపారు. మృతి చెందిన నాగరాజుకు ఉపాధి హామీ చట్టం ప్రకారం డెత్ క్లయిమ్ వర్తిస్తుందని ఏపీవో పుణ్యదాస్ తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed