సందడి సందడిగా ఫ్రీ క్రిస్మస్ వేడుకలు

by Bhanu |

మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారిని లత కుమారి నారాయణఖేడ్ ప్రాజెక్టులో అంగన్వాడీ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు

సందడి సందడిగా ఫ్రీ క్రిస్మస్ వేడుకలు
X

దిశ, నారాయణఖేడ్: మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారిని లత కుమారి నారాయణఖేడ్ ప్రాజెక్టులో అంగన్వాడీ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాంప్రదాయ పండుగలు భాగంగా తిమ్మాపూర్ అంగన్వాడీ సెంటర్‌లో ఫ్రీ క్రిస్మస్ వేడుకలు చిన్నారులతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిని లలితా కుమారి అంగన్వాడీ సెంటర్లలో సౌకర్యాలు , రిజిస్టర్‌లను తనిఖీ చేశారు. పిల్లలకు సాంప్రదాయ పండుగలు వాటివిశిష్టత గురించివివరించారు. అదేవిధంగా పిల్లలకు పౌష్టికాహారం అందే విధంగా చర్యలు చేపడుతున్నట్టు తెలియజేశారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ ఐసిడిఎస్ ప్రాజెక్టు ఇంచార్జ్ సిడిపిఓ ఎన్. సుజాత , అంగన్ వాడీ సూపర్వైజర్ ప్రమీల , అంగన్ వాడీ టీచర్స్ ,చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story