- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్టర్ సీరియస్..!
జోగిపేట ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తనిఖీ చేశారు

దిశ,ఆందోల్: ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడితే సహించేది లేదని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య హెచ్చరించారు. మంగళవారం జోగిపేట ఏరియా ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రిజిస్టర్‌ను పరిశీలించగా, పలువురు వైద్యులు విధులకు హాజరు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు హాజరుకానీ వైద్యులు, సిబ్బంది వివరాలను, డిప్యూటేషన్‌పై ఉన్న సిబ్బంది వివరాలను ఆరా తీసారు. విధులకు గైర్హాజరైన 11 మంది వైద్యులకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీసీహెచ్‌ఎస్‌ను ఆదేశించారు. ఓపి, డయాలసిస్, ఐసియూతో సహా అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవలు, పరికరాల వినియోగం, శుభ్రత, మందుల లభ్యత వంటి అంశాలను పరిశీలించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రులలో పేద ,మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా మెరుగైన వైద్య చికిత్సలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య చికిత్సలు అందించాలన్నారు. రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్యులు, వైద్య సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వైద్యవృత్తి ఎంతో పవిత్రమైనదని, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఆమె వెంట ఆర్‌డీఓ పాండు, తహసీల్దార్ మధుకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
- Tags
- medak






