- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
50 మంది ఆడబిడ్డలకు పుస్తె మట్టల పంపిణీ
సిద్దిపేట అర్బన్ మండలంలో సుమారు 50 మంది ఆడ బిడ్డలకు పుస్తె మట్టెలు పంపిణీ చేసిన మిట్టపల్లి గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్

దిశ, సిద్దిపేట అర్బన్: సిద్దిపేట అర్బన్ మండలంలో సుమారు 50 మంది ఆడ బిడ్డలకు పుస్తె మట్టెలు పంపిణీ చేసిన మిట్టపల్లి గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ లీడర్ జెపి యాదవ్ ను పిఎసిఎస్ చైర్మన్ చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం గ్రామంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ తో కలిసి జేపీ యాదవ్ మాట్లాడుతూ ఆడబిడ్డలకు చేయూత అందించడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇప్పటివరకు సుమారు 50 మందికి పుస్తే మట్టెలు పంపిణీ చేయడం జరిగిందని గ్రామంలో నిరుపేదలకు బియ్యం కూడా అందించి ఆదుకున్నామని తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా ఇటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని భవిష్యత్తులో కూడా ఆడబిడ్డలకు అండగా ఉంటామని తెలిపారు. మిట్టపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి నిస్వార్థంతో ఇటువంటి సహాయ సహకారాలు అందించడం తమకు గర్వంగా ఉందని గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.






