కబ్జాలపై కొరడా

by Bhanu |

జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని కాజిపల్లి సర్వే నంబర్ 181లో ప్రభుత్వ భూమిపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు

కబ్జాలపై కొరడా
X

దిశ, జిన్నారం: జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని కాజిపల్లి సర్వే నంబర్ 181లో ప్రభుత్వ భూమిపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేసిన నిర్మాణాలను మండల తహసిల్దార్ దేవదాస్ ఆదేశాల మేరకు ఆర్‌ఐ జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారుల సహకారంతో కూల్చివేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రభుత్వం భూములను ఆక్రమించే ప్రయత్నాలు చట్టపరమైన చర్యలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఇలాంటి ప్రయత్నాలు జరిగితే బాధ్యులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.

Next Story