- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబుల్ బెడ్ రూం ఇప్పిస్తానని మోసం
దిశ, సిద్దిపేట అర్బన్ : డబుల్ బెడ్ రూం ఇప్పిస్తానని.. డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేసిన ఘటన సిద్దిపేట టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ

X
దిశ, సిద్దిపేట అర్బన్ : డబుల్ బెడ్ రూం ఇప్పిస్తానని.. డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేసిన ఘటన సిద్దిపేట టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం... కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన బూర అమలకు సిద్దిపేట కేసీఆర్ నగర్ కాలనీలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని అంబేద్కర్ నగర్ కు చెందిన గడ్డ ప్రసాద్ రూ.2 లక్షల 50 వేలు తీసుకున్నాడు. అమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు అపై అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించడంతో కరీంనగర్ జైలుకు తరలించినట్లు సీఐ వెల్లడించారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story






