లోన్ పేరిట కుచ్చుటోపి.. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు

by Disha Web Desk 20 |
లోన్ పేరిట కుచ్చుటోపి.. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : లోన్ పేరిట సైబర్ నేరస్తుడు డబ్బులు కాజేసిన సంఘటన గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బాధితుడి వాట్సప్ నెంబర్ కు గుర్తుతెలియని సైబర్ నేరగాడు లింకు పంపించాడు. బాధితుడు లింకు ఓపెన్ చేసి సైబర్ నేరగాడు చెప్పిన విధంగా అన్ని వివరాలు పంపించాడు. లోన్ అమౌంట్ సాంక్షన్ అయిందని చెప్పగానే నమ్మపలికి, జీఎస్టీ, ఇతర చార్జీలు త్వరగా చెల్లించాలని సైబర్ నేరస్తుడు తెలిపాడు.

ఈ మేరకు సైబర్ నేరస్తుడు పంపించిన మరో లింకును ఓపెన్ చేసి బాధితుడు బ్యాంకు వివరాలు ఓటీపీ నెంబర్ చెప్పగానే బాధితుడు అకౌంట్ లో ఉన్న రూ.80వేలు డెబిట్ అయ్యాయి. ఆశకు పోయి మోసపోయినానని బాధితుడు వెంటనే జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితులు పంపిన వాట్సఫ్ లింక్ లు ఓపెన్ చేయవద్దన్నారు.

Next Story

Most Viewed