కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ ఫోటో తీసేయాలనే కుట్ర

by Nallavelli.Anjaneyulu |

దిశ, సంగారెడ్డి : కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ చిత్రాన్ని తీసేయాలని కుట్ర బిజెపి ప్రభుత్వం పన్నుతోందని టీపీసీసీ

కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ ఫోటో తీసేయాలనే కుట్ర
X

దిశ, సంగారెడ్డి : కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ చిత్రాన్ని తీసేయాలని కుట్ర బిజెపి ప్రభుత్వం పన్నుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 140 ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ కుటుంబ చరిత్ర దేశంలో లేకుండా చేయాలని చూస్తున్నారనీ, దీని వెనక ప్రధానంగా మోడీ, అమిత్షాల కుట్ర దాగి ఉందన్నారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించాలని మహాత్మా గాంధీ నేతృత్వంలో మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ ఇంకా ఎందరో పెద్దలు దేశ స్వాతంత్రం కోసం శాంతియుత మార్గంలో పోరాటం చేశారనీ గుర్తు చేశారు. జవహర్ లాల్ నెహ్రూ కాబినెట్ లో అంబేద్కర్ న్యాయ శాఖ మంత్రిగా ఉండి, సమస్త కులాలు, సమస్త మతాల ప్రజలు స్వేచ్ఛగా ఉండాలని రాజ్యాంగం రాసారనీ తెలిపారు. స్వాతంత్ర ఉద్యమంలో మోదీ, అమిత్ షా పాత్ర లేదనీ, స్వాతంత్రం వచ్చినపుడు వారు ఇంకా పుట్టనే లేదన్నారు. కానీ జవహర్ లాల్ నెహ్రూ దేశానికి ఏం చేశారని మోదీ, అమిత్ షా చాలా విచిత్రంగా మాట్లాడడం సరి కాదన్నారు. దేశ స్వాతంత్రం కోసం జవహర్ లాల్ నెహ్రూ 12 ఏళ్లు జైలు జీవితం గడిపారనీ, ఈ దేశ ప్రజల కోసం ఇందిరాగాంధీ కూడా జైలుకు వెళ్లారన్నారు. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, రాహుల్ గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేసి మోదీ, అమిత్ షా పని చేస్తున్నారనీ, ఈ విషయాన్ని దేశ ప్రజలు గమనించాలన్నారు. ఈ దేశప్రజలు సుఖ శాంతులతో బతకాలన్నా, హక్కులు పొందాలన్నా రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావడం ఒక్కటే అసలైన మార్గం ఉందన్నారు.

Next Story