పోటాపోటీగా లడ్డూ వేలంపాట..

by Kema Shiva Kumar |

గణపతి నిమర్జనాన్ని పురస్కరించుకొని నిర్వాహకులు ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూ వేలంపాటలో పోటాపోటీగా ఇద్దరు నాయకులు లక్షల్లో లడ్డూలను వేలం పాటలో దక్కించుకుంటున్నారు.

పోటాపోటీగా లడ్డూ వేలంపాట..
X

దిశ, మనోహరాబాద్ : గణపతి నిమర్జనాన్ని పురస్కరించుకొని నిర్వాహకులు ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూ వేలంపాటలో పోటాపోటీగా ఇద్దరు నాయకులు లక్షల్లో లడ్డూలను వేలం పాటలో దక్కించుకుంటున్నారు. మండల పరిధిలలోని కాళ్లకల్ గ్రామంలో క్రేజీ బాయ్స్ టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి నిమజ్జనం సందర్భంగా రెండు లడ్డూలకు వేలంపాటను నిర్వహించారు. వేలంలో బీఆర్ఎస్ కు చెందిన టీ.వీ.రావు, తుమ్మల వెంకటేశ్వరరావు యాదవ్ రూ.1.70 లక్షలకు, కాంగ్రెస్ నాయకుడు లబ్ధిపీర్ల శ్రీనివాస్ గౌడ్ రూ.1.25 లక్షలకు లడ్డూలను కైవసం చేసుకుని రికార్డ్ సృష్టించారు.

Next Story