భూ కబ్జాలపై కలెక్టర్ సీరియస్

by Thanuru Gopichand |   (  Updated:2026-01-23 02:24:21  IST  )

దిశ కథనంతో అధికార యంత్రాంగంలో చలనం.

భూ కబ్జాలపై కలెక్టర్ సీరియస్
X

దిశ, నారాయణఖేడ్: నారాయణఖేడ్ డివిజన్లోని పెద్దశంకరంపేట ఆనుకొని ఉన్న తిరుమలాపూర్ భూముల్లో రోజుకో భూకబ్జా బయటపడింది. దిశ పేపర్ లో కథనాలు రావడంతో పెద్ద శంకరంపేటలో కలెక్టర్ ప్రజావాణి నిర్వహించారు. భూముల్లో పోర్జరీ సంతకాలతో బిల్డింగులు నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూమి అని తెలియదా..? ఎవ్వరు రిజిస్ట్రేషన్ చేశారు..? అందులో భవంతులు ఎలా నిర్మించారు..? అని ఆరా తీశారు. వెంటనే ప్రభుత్వ భూమికి చుట్టూ ప్రహరీ నిర్మించాలని ఆదేశించారు. భూ అక్రమాలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు కబ్జాదారులతో చేతులు కలిపేశారు. 12ఎకరాల ప్రభుత్వ భూములకు అక్రమణకు గురవుతున్నా అడిగేవారు లేకుండా పోయారు. దీంతో భూ అక్రమాణ దారులు రెచ్చిపోతున్నారు. పెద్ద శంకరంపేట తిరుమలాపూర్ లోని ఇప్పటికే ఎర్రకుంట, అసైన్డ్ భూముల్లో భవంతులు వెలిశాయి. ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు దర్జాగా కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్మేశారు. ఈ భూమి కండ్ల ఎదుటనే అక్రమణకు గురవుతున్నప్పటికీ అధికారులు పట్టించుకాలేదని స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇదేం న్యాయం..

పేదలకు ఓ న్యాయం... దొరలకు మరో న్యాయమా.. అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నట్లు విమర్శిస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి ఎర్ర కుంట, అసైన్డ్ భూములు, రోడ్డు భవనాల కార్యాలయం సంబంధించిన భూములను దర్జాగా ఆక్రమించి కొందరు అనుభవిస్తున్నారు. ఇది చాలాదన్నట్లుగా ఇప్పుడు అక్రమార్కుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. పెద్ద శంకరంపేట అనుకొని ఉన్న ఎర్రకుంట సర్వే నంబర్ 258లో 2.27 ఎకరాల అసైన్డ్ భూమి సర్వే నంబరు 1 లో 9. 20 ఎకరాల భూమి ఉంది. రోడ్డు భవనాల శాఖ కార్యాలయం అధీనంలో 4 భూమి ఉండేది .. ఇందులో 254/9 సర్వే నంబర్లు లో 1.17 ఎకరాలు , 254/9/1లో 17గుంటల ప్రభుత్వ భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ భూమి కోట్ల ధర పలుకుతుంది. ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్లాట్లను వేసిన వెంటనే పోటాపోటీగా కొనుగోలు చేశారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూములకు ఆక్రమించుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పంచాయతీలో అక్రమార్కుల రాజ్య అయిపోయింది. ఇప్పటివరకు 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్మినప్పటికీ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలు లేవు. రెవెన్యూ అధికారుల మౌనం వహించడం వెనుక భూమి ఆక్రమించుకున్న ముడుపుల ఒప్పందాలే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో రెవెన్యూ అధికారుల తీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఉండదు. ఇక్కడ పైసలు ఇస్తే అంగట్లో దొరికే సర్కుల్లాగా మ్యుటేషన్లకు ఒక రేటు, పట్టాదారు పుస్తకాలకు మరో రేటు, ప్రభుత్వ భూముల కబ్జా చేస్తే మరో రేటు, ఆ భూముల్లో ప్లాట్లు వేసి అమ్ముతే మరో రేటు ఇక చెప్పాలంటే రెవెన్యూ అధికారుల అనుమతి లేనిది ఏ కబ్జా, ఏ అక్రమణ జరగదు అన్నది వాస్తవం. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయి కూర్చుని ఉన్న కొంతమంది అవినీతి అధికారుల సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్నో అక్రమాలకు పాల్పడుతూ రెవెన్యూ కార్యాలయాన్ని అవినీతిమాయంగా మార్చివేశారు.

దర్జాగా కబ్జా.. భవంతుల నిర్మాణం..

రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, రోడ్డు భవనాల శాఖ అధికారులు పట్టించుకోకుండా మౌనం వహించడం ఇదే కొవ్వకు వారు కూడా చెందిన వారే నన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక దశలో ప్రభుత్వం భూమిని అమ్మేశారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ప్రభుత్వ భూమిని అమ్మకపోతే అంత ధైర్యం అందరూ చూస్తుండగా పద్మాలయా ఆసుపత్రితో పాటు అనేక భవంతులు సొంత భూములను తలపించే విధంగా పనులు ఎలా చేస్తారంటూ పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వ భూములను దర్జాగా చెట్లను తొలగించి ఇండ్లను నిర్మించుకోవడం వెనుక రెవెన్యూ అధికారుల అండదండలు పూర్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 12ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని తమ ఆధీనంలోనికి తెచ్చుకునేందుకు కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ భూమిని దర్జాగా ఆక్రమించుకొని కబ్జా చేసి అమ్మేశారు. ప్రభుత్వ భూమిని అమ్మి వేశారని అంటూ మరికొందరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవ్వరు ఏమన్నా ఎన్ని విమర్శలు చేసినా మాకేమి సిగ్గు అన్నట్లుగా కొంతమంది అవినీతి అధికారులు వ్యవహరిస్తున్నట్లు తీరు. తిరుమలాపూర్ ప్రభుత్వ భూమిపై రెవెన్యూ లో చోటు చేసుకున్న ఈ భూ బాగోతంపై ఉన్నత స్థాయి అధికారులు అవసరమైనటువంటి చర్యలు చేపట్టకపోతే ఇక్కడ అక్రమార్కుల రాజ్యమైపోయి రాబోయే రోజుల్లో ప్రభుత్వ భూమి రికార్డులో కూడా కనిపించకుండా పోతున్నది నగ్న సత్యం.

దిశ కథనాలతో విచారణ

మండల కేంద్రంలో ఈనెల 12న జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ కు పలువురు భూకబ్జా విషయమై ఫిర్యాదు చేశారు. ఎర్రకుంట శిఖం భూమి తోపాటు1, 256, 258 సర్వే నెంబర్లు భూములను కొందరు ఆక్రమించి నిర్మాణం చేపట్టారని, వడ్డెర కాలనీలో పీటీఐ నంబర్లు వేసి యాజమాన్య పత్రాలు సృష్టించి భూములను అమ్మారని కేంద్ర ఎఫ్సిఐ మాజీ డైరెక్టర్ విగ్రహం శ్రీనివాస్ గౌడ్ కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీతో పాటు రెవెన్యూ శాఖలో ఎలాంటి రికార్డులు లేకున్నా యజమాన్య ధ్రువపత్రాలు ఇతర ధ్రువపత్రాలను ప్రోజరీ సంతకాలతో అమ్మకాలు జరిపారని వీటిపై సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వ భూములను కంచెలు ఏర్పాటు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే కలెక్టర్ రాహుల్ రాజ్ స్పందించి ప్రజావాణిలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమి చుట్టూ ప్రహరిగోడ నిర్మించాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఆక్రమణ దారులు ఎంతటి వారైనా వదిలి పెట్టొద్దు అని సూచించారు.

Next Story