- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డి ఓ మూర్ఖుడు.. మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి ఓ మూర్ఖుడని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఫైర్ అయ్యారు. పోరాటాల ద్వారా వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ కు... ఓట్ల రాజకీయాలతో

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి ఓ మూర్ఖుడని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఫైర్ అయ్యారు. పోరాటాల ద్వారా వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ కు... ఓట్ల రాజకీయాలతో అడ్డదారిన సీఎం అయిన వారికి తేడా ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... 42 శాతం బీసీ రిజర్వేషన్ల పేరిట కొండంత రాగం తీసిన సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన 24 శాతం బీసీ రిజర్వేషన్లను ఊడగొట్టి 17 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నాడని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ బతుకమ్మ ప్రతి పండుగకు చీరలు పంపిణీ చేస్తే... నేడు ఎలక్షన్లు ఉన్నచోటనే చీరలను పంపిణీ చేస్తూ.. పట్టణాల్లో చీరల పంపిణీ బంద్ చేశాడని మండిపడ్డారు. ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు దీక్ష దివస్ అన్నారు. కెసిఆర్ లేనిది తెలంగాణ లేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చింది మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యే వాడు కాదన్నారు. టిడిపిలోనే ఉండేవాడని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. నవంబర్ 29 తేదీ నుంచి డిసెంబర్ 9 తేదీ వరకు ఉద్యమంలో నేను పేరిట సోషల్ మీడియా వేదికల్లో ఉద్యమంలో పాల్గొన్న సందర్భాలను పోస్ట్ చేయాలని రాష్ట్ర ప్రజలకు పార్టీ కార్యకర్తలకు హరీష్ రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ పాల్గొన్నారు.






