వారం రోజులైనా తాగడానికి నీళ్లు ఇవ్వరా..?

by Ratna Kumari |

దిశ, సంగారెడ్డి అర్బన్ : సంగారెడ్డి ప‌ట్ట‌ణంలోని మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న నీటిని ప్రతి రోజు సరఫరా చేయాలని,

వారం రోజులైనా తాగడానికి నీళ్లు ఇవ్వరా..?
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : సంగారెడ్డి ప‌ట్ట‌ణంలోని మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న నీటిని ప్రతి రోజు సరఫరా చేయాలని, అధికారుల నిర్లక్ష్యం వీడనాడాలని సోమవారం ఎస్పీ ఆఫీసు ముందు ఆదిత్య నగర్ కాలనీ వాసులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు జి సాయిలు మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలో లక్ష ఇరవై వేల జనాభా ఉంటే సుమారు 60,000 జనాభాకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా ఉంటుందని రోజు 9 లక్షల లీటర్ల నీరు సరఫరా అవసరం ఉండగా అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రతిరోజు 4 లక్షల లీటర్ల నీరు రావడంతో 8 ట్యాంకులు నిండక అనేక బస్తీల్లో ప్రజలు, కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కలెక్టర్ ఆఫీస్ వెనుక భాగం నుంచి మల్కాపూర్ చౌరస్తా వరకు నీటి సమస్యతో ప్రతిరోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్న, మంచి నీటిని తాపరా..? అని ప్రశ్నించారు. ఇదేనా ప్రజా పాలన అంటే అని అన్నారు. సంగారెడ్డి పట్టణంలో వారం రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు ఇబ్బంది పడుతుంటే ,ప్రభుత్వానికి పట్టదా అని అడిగారు. ప్రజా పాలనలో ప్రజల సమస్యలు పట్టించుకునే అధికారులు ఎక్కడ అని అన్నారు. నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మున్సిపల్ అధికారులకు మిషన్ భగీరథ అధికారులకు విన్నవిస్తుంటే ఒకరిపై ఒకరు చెప్పుకోవడం తప్ప సమస్య పరిష్కారం చేయడం లేదని, సమస్య పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను సస్పెండ్ చేసి తాగునీటి సమస్య పరిష్కరించాలని, లేనిచో అనేక కాలనీ నుండి ప్రజలను సమీకరించి కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు రవి గోపాల్ గౌడ్, వెంకటేష్, పాండు, దత్తు ,పెంటయ్య, నరసింహులు, వేణుగోపాల్ పాల్గొన్నారు.

Next Story