కాంగ్రెస్ అబద్దాల పునాదుల మీద గద్దెనెక్కింది

by Bhanu |

సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు దీక్షా విజయ్ దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

కాంగ్రెస్ అబద్దాల పునాదుల మీద గద్దెనెక్కింది
X

దిశ, సిద్దిపేట అర్బన్: సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు దీక్షా విజయ్ దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో కోటిలింగాల దేవాలయం వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. మోడల్ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ దీక్ష ఫలితమే డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన అన్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ప్రాణాలను పనంగా పెట్టిన, అంబేద్కర్ మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను కేసీఆర్ కోఠి ఎకరాల మగానిగా తీర్చిదిద్దారన్నారు. అబద్దాల పునాదుల మీద గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, పాల సాయిరాం, కాముని శ్రీనివాస్, ఎల్లారెడ్డి, బాలమల్లు, పాపయ్య, కనకరాజు, ఆంజనేయులు, మేర సత్యనారాయణ, కరాటే కృష్ణ, ఇర్షాద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story