రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే: ఎమ్మెల్యే మాణిక్ రావు

by Disha Web Desk 6 |
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే: ఎమ్మెల్యే మాణిక్ రావు
X

దిశ, ఝరాసంగం: తెలంగాణ మోడల్‌ కావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ నాయకత్వం ఎంతో అవసరమని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. శుక్రవారం ఝరాసంగం మండలంలోని బర్దిపూర్‌లో ఈ నెల 10న ఝరాసంగం మండల కేంద్రంలో 16 గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కోసం సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే మాణిక్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామస్తులను, గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కార్యకర్తలు పాల్గొని పలు విషయాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో రెండో విడత భూసేకరణ నిలిపివేయాలని, సర్వేనెంబర్ 72 ఇనామ్ భూములకు శాశ్వత పట్టాలు ఇప్పించాలని, రైతు రుణమాఫీ చేయాలని, ఇల్లు లేనివారికి ఇండ్లు ఇప్పించాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. అనంతరం ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ.. దేశమంతా కేసీఆర్ నాయకత్వం కోరుకుంటుందని ఇప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరం అని అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలు ప్రతి కుటుంబానికి చేరాయని అన్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. 10న ఝరాసంగం జరిగే ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామస్తులు చెప్పిన సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని గ్రామస్తులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జగదీశ్వర్, గ్రామ సర్పంచ్ శివలక్ష్మి కృష్ణ, పొట్టి పల్లి ఎంపిటిసి రాజు, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రమేష్ పాటిల్, మాచనూర్ మాజీ సర్పంచ్ వెంకటేశం, గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed