హల్దీ వాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

by Thanuru Gopichand |   (  Updated:2025-10-26 07:42:26  IST  )

వెల్దుర్తి సమీపంలోని హల్దీ వాగులో ఆదివారం ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.

హల్దీ వాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
X

దిశ, వెల్దుర్తి: వెల్దుర్తి సమీపంలోని హల్దీ వాగులో ఆదివారం ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఎవరో గుర్తు తెలియని మహిళ హల్ది వాగులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వెల్దుర్తి ఎస్ఐ రాజును వివరణ కోరగా.. సమాచారం తెలుసుకొని మృతదేహాన్ని పరిశీలించామన్నారు. జరిగిన సంఘటన తమ పరిధిలోకి రాదని చిన్న శంకరంపేట పరిధిలోకి వస్తుందన్నారు. అక్కడి పోలీసులకు సమాచారం అందించామని ఎస్ఐ తెలిపారు.

Next Story