రూ.6కోట్ల 34 ల‌క్ష‌ల‌తో న‌ర్సాపూర్, ఎర్ర చెరువుల సుంద‌రీక‌రణ : ఎమ్మెల్యే హ‌రీశ్ రావు

by Ratna Kumari |   (  Updated:2025-11-27 12:44:48  IST  )

దిశ, సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట పట్టణం లోని ఎర్ర చెరువు రూ.3.14, నర్సాపూర్ చెరువును రూ.3.20 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు చెప్పారు.

రూ.6కోట్ల 34 ల‌క్ష‌ల‌తో న‌ర్సాపూర్, ఎర్ర చెరువుల సుంద‌రీక‌రణ : ఎమ్మెల్యే  హ‌రీశ్ రావు
X

దిశ, సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట పట్టణం లోని ఎర్ర చెరువు రూ.3.14, నర్సాపూర్ చెరువును రూ.3.20 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు చెప్పారు. ఎర్రచెరువు, నర్సాపూర్ చెరువులను హరీశ్ రావు పరిశీలించి మాట్లాడారు. ఎర్ర చెరువు లోకి మురికి నీరు చేరకుండా చెరువు పక్క నుంచి తూములోకి మురికి నీరు వెళ్లే విధంగా డ్రైనేజి నిర్మాణం చేపట్టే విధంగా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. నర్సపూర్ చెరువులో పూర్తిగా మురికి నీరు ఉండటం వలన అ ప్రాంతం అంతకుడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎస్టీపీ ప్రాంతం నుంచి చెరువు కిందకు మురికి నీటి డ్రైనేజీ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. చెరువుల్లో స్వచ్ఛ‌మైన నీరు ఉండే విధంగా సుందరంగా తీర్చిదిద్దాలన్నారు.

Next Story