నిరాధారమైన ఆరోపణలు సరికాదు : ఏసీపీ ర‌వీంద‌ర్

by Ratna Kumari |

దిశ, సిద్దిపేట ప్రతినిధి : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్దిపేట పోలీసులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని అసిస్టెంట్ కమిషనర్

నిరాధారమైన ఆరోపణలు సరికాదు : ఏసీపీ ర‌వీంద‌ర్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్దిపేట పోలీసులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీందర్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసులు అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తూ మిగితా అభ్యర్థులపై కేసులు నమోదు చేస్తున్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసత్యం అన్నారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన సంఘటనలపై ఓటర్లను ప్రలోభపెట్టిన అంశాలపై అందిన ఫిర్యాదుల మేరకు సిద్దిపేట పోలీసులు చట్టపరంగా మాత్రమే కేసులు నమోదు చేశార‌ని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలో ఎన్నికల నియమావళిని ఉల్లంగించిన వారిపై 50 ఎలక్షన్ కేసులు, 14 అక్రమ మద్యం నిల్వల కేసులు నమోదు చేసి, 491.38 లీటర్ల మద్యం, రూ. 1,30,400 నగదు, 32 వాహనాలను జప్తు చేయడం జరిగిందన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా వినియోగించుకునేలా పోలీస్ శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. పోలీసులపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏసీపీ రవీందర్ వెల్లడించారు.

Next Story