- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నవోదయకు పరీక్షకు సర్వం సిద్ధం
ఉమ్మడి మెదక్ జిల్లాలో నవోదయ ఎంపిక పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2026-27 విద్యాసంవత్సరానికి వర్గల్ నవోదయలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 13న ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుంది.

దిశ, వర్గల్: ఉమ్మడి మెదక్ జిల్లాలో నవోదయ ఎంపిక పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2026-27 విద్యాసంవత్సరానికి వర్గల్ నవోదయలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 13న ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుంది. ఇందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,754 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, పరీక్ష నిర్వహణకు 22 కేంద్రాలు ఏర్పాటు చేశామని వర్గల్ నవోదయ ప్రిన్సిపాల్ రాజేందర్ తెలిపారు. మంగళవారం ఆయన పరీక్షకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల విద్యాశాఖాధికారుల సమక్షంలో ఆయా జిల్లా కేంద్రాల్లో సెంటర్ సూపరింటెండెంట్లు, సెంటర్ లెవెల్ అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాల వివరాలు వెల్లడించారు. అభ్యర్థులు అనుమానాల నివృత్తికి 73823 35164, 94489 01318 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
- Tags
- medak






