అన్నా.. సోషల్ మీడియాను వీడి ప్రజల్లోకి రా..? కేటీఆర్‌కు కవిత సలహా

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-15 10:54:16  IST  )

దిశ, మెదక్ ప్రతినిధి : కేటీఆర్ సోషల్ మీడియాలోనే పోరాటం చేస్తున్నార‌ని.. సమస్యల పై పోరాటం చేసేందుకు ప్రజలోకీ రావాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సలహా ఇచ్చారు.

అన్నా.. సోషల్ మీడియాను వీడి ప్రజల్లోకి రా..? కేటీఆర్‌కు కవిత సలహా
X

దిశ, మెదక్ ప్రతినిధి : కేటీఆర్ సోషల్ మీడియాలోనే పోరాటం చేస్తున్నార‌ని.. సమస్యల పై పోరాటం చేసేందుకు ప్రజలోకి రావాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సలహా ఇచ్చారు. మెదక్ జిల్లాలో కవిత పర్యటన రెండవ రోజు శనివారం కూడా సాగింది. మెదక్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ కు కళ్లకు గంతలు కట్టి బీఆర్ఎస్ ను అధోగతి పాలు చేశారన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికలు రాష్ట్రంలో ప్రతి పక్షం బలంగా లేదన్న విషయాన్ని గుర్తు చేసిందన్నారు. అన్నా కేటీఆర్ సోషల్ మీడియాలోనే ప్రజల సమస్యలు తీసుకు వస్తున్నాడని, సోషల్ మీడియాను వీడి ప్రజల్లోకి వచ్చి సమస్యల పై పోరాటం చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా సరైన పాత్ర పోషించడం లేదన్నారు. గ్రామాల్లో అధికార పార్టీపై వ్యతిరేకత ఉన్న జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓటమికి ప్రతిపక్షం బలంగా లేకపోవడమే ఓటమి పాలైందన్నారు.

హరీష్ రావుకు 400 ఎకరాల భూమి

హరీష్ రావు పార్టీని మోసం చేయడం మానుకోవాలన్నారు. కృష్ణార్జున అనుకునేవాళ్ళు ఒకరి దెబ్బలు ఒకరు చర్చించుకున్నారన్నారు. ఒక సభ సక్సెస్ అయితే కేసీఆర్ ని మోసినట్లు ఫీల్ అవుతున్నారని, ఆయన ముందు వీరంతా బచ్చలు అని పేర్కొన్నారు. హరీష్ రావు అవినీతిని బయటపెట్టిన సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రెడ్డిపల్లి, చిప్పలదుర్తి, తునికి గ్రామాల మధ్య హరీష్ రావు కు 400 ఎకరాల భూమి ఉందన్నారు. ఆయన భూమి కోసమే ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ మార్చారని విమర్శించారు. ఆ ప్రాంతంలో రిసార్ట్ నిర్మాణం చేసి ప్రజలను రానివ్వడం లేదన్నారు.

గంగుల కమలాకర్ కోసమే ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ మార్పు

చిన్న చింతకుంటలో గంగుల కమలాకర్ కు 15 ఎకరాలు, నవీన్ రావు కు 18 ఎకరాలు భూమి ఉండడం అలైన్ మెంట్ మార్చారని రైతులు చెబుతున్నారని, నిజామా కదా నేతలే చెప్పాలన్నారు. నేతల కోసమే ట్రిపుల్ ఆర్ ను నీటిలో వాన పాముగా రింగులు గా మార్చారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి హాస్టల్ అద్దె రూ.లక్షా 6 వేలు తీసుకుంటున్నాడని, విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవన్నారు. ఐదేళ్లుగా విద్యార్థులు అవస్థలు పడుతున్న ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఎలాంటివి కేసీఆర్ కు తెలిసి ఉండవని, తెలిస్తే ఆయన ఒప్పుకునే వారు కాదన్నారు.

Next Story