ఈతకు వెళ్లి యువకుడి మృతి

by Kema Shiva Kumar |

స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి నీట మునిగి యువకుడు మృతి చెందిన ఘటన మిరుదొడ్డి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది.

ఈతకు వెళ్లి యువకుడి మృతి
X

దిశ, మిరుదొడ్డి: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి నీట మునిగి యువకుడు మృతి చెందిన ఘటన మిరుదొడ్డి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన మల్కాపురం నితిన్ (18) స్నేహితులతో కలిసి సరదాగా స్థానిక కూడవెళ్లి వాగులో ఈతకు వెళ్లి శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకి తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Next Story