- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముస్త్యాలలో దొంగ అరెస్ట్
by Bhanu |
చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో గత నెల 24 న సొంటే నర్సమ్మ అనే మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెల తాడును అపహరించిన దొంగను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు చేర్యాల ఎస్సై నవీన్ తెలిపారు

X
దిశ, చేర్యాల: చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో గత నెల 24 న సొంటే నర్సమ్మ అనే మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెల తాడును అపహరించిన దొంగను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు చేర్యాల ఎస్సై నవీన్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ముస్త్యాల గ్రామానికి చెందిన నర్సమ్మ అనే మహిళ మధ్యాహ్నం ఇంట్లో ఉన్న సమయంలో హెల్మెట్ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి వచ్చి ఆమె మెడలో ఉన్న 32 గ్రాముల బంగారు పుస్తెల తాడును లాక్కొని బైక్ పైన పారిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన చేర్యాల పోలీసులు చోరికి పాల్పడ్డ వ్యక్తి కర్రి నరేష్‌గా గుర్తించి అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనం,మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని జ్యుడిషిల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు.
- Tags
- medak
Next Story






