సంగారెడ్డి శిల్పికి అరుదైన గౌరవం

by Bhanu |

సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌కు చెందిన ప్రముఖ శిల్ప కళాకారుడు హోతి బస్వరాజ్‌కు మరోసారి జాతీయస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది.

సంగారెడ్డి శిల్పికి అరుదైన గౌరవం
X

దిశ, ఝరాసంగం: సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌కు చెందిన ప్రముఖ శిల్ప కళాకారుడు హోతి బస్వరాజ్‌కు మరోసారి జాతీయస్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ఈనెల 9 నుండి 24 వరకు న్యూ ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి శిల్పకళ ప్రదర్శనకు ఎంపికయ్యారు. అఖిల భారతీయ శిల్పకళా, క్రాఫ్ట్ సొసైటీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ ప్రదర్శన ఈనెల 9 నుండి న్యూఢిల్లీలోని రఫీ మార్గ్ భవనంలో జాతీయస్థాయిలో కళా ప్రదర్శనలు జరగనున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ శిల్ప కళాకారులు తయారు చేసిన అరుదైన, ప్రత్యేక శిల్పాలను ప్రదర్శించనున్నారు. న్యాల్‌కల్‌కు చెందిన ప్రముఖ శిల్ప కళాకారుడు బస్వరాజ్ రూపొందించిన అమ్మ ఒడిలో భూమాత, భారతీయ సంస్కృతిలో మానవుని ప్రతిరూపం జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల శిల్పి సంతోషం వ్యక్తం చేశారు.

Next Story