- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి కేసులో నలుగురికి పదేళ్ల జైలు శిక్ష
దిశ, సంగారెడ్డి అర్బన్ : గంజాయి కేసులో నలుగురికి పదేళ్ల జైలు శిక్ష విధించిన సంఘటన సంగారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్

దిశ, సంగారెడ్డి అర్బన్ : గంజాయి కేసులో నలుగురికి పదేళ్ల జైలు శిక్ష విధించిన సంఘటన సంగారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎక్సైజ్ సీఐ మదు బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. 2019లో 160 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ సంగారెడ్డి ఎక్సైజ్ సిబ్బందికి పట్టుబడిన నలుగురికి, సోమవారం అడిషనల్ డిస్టిక్ట్ మెజిస్ట్రేట్ పదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. 2019లో 160 గంజ్ కేజీల గంజాయిని అక్రమంగాతరలిస్తున్నటువంటి పోలగోని నిఖిల్, పవర్ శ్రీనివాస్, పవర్ సంతోష్, రాథోడ్ శ్రీకాంత్ లు అరెస్ట్ చేశారు. సీఐలు మోహన్ కుమార్, రమేష్ రెడ్డి, ఎస్సైలు రాజు,కేఎం విశ్వనాథులు పట్టుకున్నారు. నిందితులను, గంజాయిని సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ సీఐ గా మధుబాబు కేసు నమోదు చేసి షార్జ్ షీట్ వేశారు. ఈ కేసులో పూలగోని నిఖిల్ నల్లగొండ, పవర్ శ్రీనివాస్, పవార్ సతీష సంగారెడ్డి, రాథోడ్ శ్రీకాంత్ బీదర్ కర్ణాటక చెందిన నలుగురికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు న్యాయమూర్తి వెలువరించారని రాజేశ్వర్ పబ్లిక్ పాసిక్యూటర్ తెలిపారు. గంజాయి కేసులో నలుగురికి పదేళ్ల పాటు జైలు శిక్ష పడేలా పని చేసిన ఎక్సైజ్ సిబ్బందిని, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ ఖాసీం, మెదక్ డిప్యూటీ కమిషనర్ జై హరికిషన్ ,సంగారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు అభినందించారు.






