ఆర్టీసీని ప్రజలకు దూరం చేయకండి: ఉద్యోగులకు MD నాగిరెడ్డి విజ్ఞప్తి

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) నాగిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కార్మికులు మొండిపట్టు వీడి, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.

ఆర్టీసీని ప్రజలకు దూరం చేయకండి: ఉద్యోగులకు MD నాగిరెడ్డి విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) నాగిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కార్మికులు మొండిపట్టు వీడి, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ఆర్టీసీ అనేది సామాన్య ప్రజల రవాణా వ్యవస్థ అని, సమ్మె ద్వారా సంస్థను ప్రజల నుంచి దూరం చేయవద్దని నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘాల తీరు వల్ల సామాన్య ఉద్యోగులు ఇబ్బందుల్లో పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె కొనసాగుతున్నప్పటికీ, ప్రజలకు ఇబ్బంది కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 25 శాతం బస్సులను నడుపుతున్నట్లు ఎండీ వెల్లడించారు. కార్మికులు పెట్టిన 32 డిమాండ్ల విలువ సుమారు రూ.35 వేల కోట్లుగా ఉందని, ఇది సంస్థపై భారీ భారాన్ని చూపుతుందని ఆయన పేర్కొన్నారు.

పాత సమస్యలే..

ఇప్పుడు కార్మికులు లేవనెత్తుతున్న సమస్యలు కొత్తవి కావని, ఇవి ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నవని గుర్తుచేశారు. యూనియన్లు మొండిపట్టుదలతో వ్యవహరిస్తూ ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఉద్యోగులంతా సమ్మెను తక్షణమే విరమించి, ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొనాలని నాగిరెడ్డి కోరారు. మొండివైఖరితో సంస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేయవద్దని, విధి నిర్వహణలోకి రావాలని ఆయన స్పష్టం చేశారు.

Next Story