బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం.. కాంట్రాక్టర్ దారుణ హత్య

by Bhanu |   (  Updated:2025-12-08 04:51:27  IST  )

చత్తీస్గడ్ బీజాపూర్ జిల్లా, పామేడ్ పోలీస్టేషన్ పరిధిలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని మావోలు దారుణంగా చంపారు.

బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం.. కాంట్రాక్టర్ దారుణ హత్య
X

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా పామేడ్ పోలీస్టేషన్ పరిధిలో ఘోరం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని మావోయిస్టులు దారుణంగా హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్టర్ ఇంతియాజ్ అలీ ఇరపల్లి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు చేయిస్తున్నాడు. అయితే, రహదారి పనులు చేపట్టకూడదంటూ మావోయిస్టులు అతడికి ఇందకు ముందే వార్నింగ్ ఇచ్చారు. అయినా ఇంతియాజ్ అలీ వారిని పట్టించుకోకుండా పనులు చేపడుతుండటంతో ఆదివారం అతడిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఇవాళ ఉదయం పామేడ్ పోలీస్టేషన్ పరిధి గొల్లపల్లి ఏరియాలో ఇంతియాజ్ అలీ గొంతుకోసి హత్య చేశారు. తాజా ఘటనతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

Next Story