CM రేవంత్ సంచలన నిర్ణయం.. HYDలో ఆ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు

by Gantepaka Srikanth |

CM రేవంత్ సంచలన నిర్ణయం.. HYDలో ఆ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు

CM రేవంత్ సంచలన నిర్ణయం.. HYDలో ఆ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో పలు రోడ్లకు ప్రముఖుల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఫ్యూచర్ సిటీ ప్రధాన రహదారికి రతన్ టాటా పేరు, US కాన్సులేట్‌ రోడ్డుకు ప్రెసిడెంట్ ట్రంప్ ఎవెన్యూగా పేరు, గూగుల్ స్ట్రీట్ పేరుతో మరో రహదారి, మైక్రోసాఫ్ట్, విప్రో జంక్షన్ల పేర్లతో మరికొన్ని రహదార్లకు పేరు పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనుంది. దాంతో పాటు అమెరికా రాయబార కార్యాలయానికి కూడా లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మరోవైపు.. గ్లోబల్ సమ్మిట్‌కు రానున్న ప్రముఖులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటుంది. ప్రతి అంశంలోనూ తెలంగాణ సాంస్కృతిక వైభవం కనిపించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ భవనంపై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేసి జాతీయ, అంతర్జాతీయ అతిథులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చూపించనున్నారు. సెక్రెటేరియట్ వద్ద అద్భుతమైన త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్‌‌తో రాష్ట్ర అభివృద్ధి తీరు, భవిష్యత్ లక్ష్యాలను ఆకర్షణీయంగా చూపించేందుకు ప్రణాళిక రూపొందించారు. రైజింగ్ తెలంగాణ - 2047 లక్ష్యాలు అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ డిస్‌ప్లేలు ఉండనున్నాయి.

Next Story